![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -518 లో..... వల్లి చేసిన తప్పు తెలుసుకొని చనిపోవాలనుకుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళిపోయాక ఏదైనా చేసుకుంటే ఆ నింద జీవితాంతం మోయ్యాలి. ఈ ఒక్కసారి క్షమించి ఇంటికి తీసుకొని వెళదాంరా పెద్దోడా అని వేదవతి అనగానే అవసరం లేదు నేను దేనికి కారణం అవ్వలేనని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఏం అంటారు.. చేసింది మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళు అంటుంది కదా.. ఈ ఒక్కసారికి క్షేమిస్తే తన కాపురం బాగా చేసుకుంటుంది కదా అని వేదవతి అనగానే ఇక తప్పక ప్రేమ, ధీరజ్ నర్మద, తిరుపతి ఒప్పుకుంటారు.
అప్పుడే రామరాజు వస్తాడు. ఏంటి బుజ్జమ్మ ఏమైంది వల్లి గురించి నిజాలు తెలియాలన్నావ్.. ఏంటా నిజాలు అని అడుగుతుంటే అందరు సైలెంట్ గా ఉంటారు. వల్లి బావిలో దూకేసింది అని సుకన్య చెప్పగానే ఏమైందని రామరాజు షాక్ అవుతాడు. వల్లి ప్రెగ్నెంట్ పోయింది అని ఇలా చేసింది అని భాగ్యం చెప్తుంది. నిజం చెప్పకండి అని వేదవతికి దండం పెడుతుంది. ఎందుకు అమ్మా.. ఇలా చేసావ్ అవన్నీ మర్చిపో.. తండ్రిలాంటి నాన్న ఉన్నాడు ఈ కష్టం రాకుండా చూసుకుంటామని రామరాజు అనేసి తన వెంట వల్లిని తీసుకొని వెళ్తాడు. ఇంకొకసారి మా గుమ్మం లో అడుగుపెడితే చంపేస్తానని భాగ్యానికి వేదవతి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు వల్లిని ఎందుకు తీసుకొని వచ్చారంటూ చందు కోప్పడతాడు. వల్లి గురించి మీ నాన్నకి తెలిస్తే తట్టుకోలేడు.. ఎవరు మీ నాన్నకి వల్లి గురించి చెప్పొద్దని వేదవతి అందరి దగ్గర మాట తీసుకుంటుంది.
ఆ తర్వాత రామరాజుకి వల్లి కాఫీ తీసుకొని వస్తుంటే.. నువ్వు రెస్ట్ తీసుకోమని వేదవతిని పిలిచి తన ఆరోగ్యం బాగా అయ్యేవరకు ఏం పని చెప్పకని కోప్పడతాడు. నా కోడలు బంగారమని వల్లి గురించి రామరాజు గొప్పగా చెప్తుంటే అందరికి కోపం వస్తుంది. అప్పుడే అమూల్య, సాగర్ వస్తారు. ఏమైందని అమూల్య అడుగుతుంది. ఏం లేదు లోపలికి వెళ్ళమని రామరాజు అంటాడు. అమూల్యకి ఈ విషయం చెప్పకండి అని రామరాజు అంటాడు.ఆ తర్వాత నర్మద కిచెన్ లో వంట చేస్తుంటే వేదవతి వెళ్లి అనవసరంగా దీన్ని కొట్టాను.. ఇప్పుడు మాట్లాడుతుందో లేదో అని లోపలికి వెళ్లి మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |